రాష్ట్రంలో ఎన్నికల కోసం ఓ వంద రోజులు కేటాయించాలని పార్టీ నాయకులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయ్యప్ప, శివ మాలధారణలాగా.. కాంగ్రెస్ దీక్ష తీసుకుందామన్నారు. సోనియమ్మ మాల వేసి కష్టపడదామని కోరారు. శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జిల్లా, మండల, బ్లాక్ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన, సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, భట్టి విక్రమార్క తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సోనియా మాల వేసుకుందాం: రేవంత్ విజ్ఞప్తి
Related tags :