Politics

రోజా ఇంటి వద్ద సంబరాలు

రోజా ఇంటి వద్ద సంబరాలు

చంద్రబాబు జీవితాంతం చిప్పకూడు తింటారని చెప్పారు వైసీపీ మంత్రి రోజా. చంద్రబాబుకు మద్దతుగా ఉన్న నేతలంతా జైలుకెళ్లే రోజు వస్తుందని జోస్యం చెప్పారు.. స్కిల్ స్కామ్‌ కేసులో విజయవాడ ఏసీబీ కోర్ట్‌ చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించగానే ఆమె తన అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తప్పు చేస్తే సామాన్యుడికి ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష చంద్రబాబుకు ఉండాలని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. ఆయనేం చట్టాలకు ఆతీతం కాదంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబును అరెస్టు చేస్తే ఎక్కడా సింపతీ రాలేదని రోజా పేర్కొన్నారు. ఇన్నాళ్లు వ్యవస్థలను చంద్రబాబు మ్యానేజ్‌ చేస్తూ వచ్చారని, ఇక ఉండదని రోజా తెలిపారు. చంద్రబాబుకు రిమాండ్‌ విధించడాన్ని స్వాగతిస్తున్నానని రోజా అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.