Politics

తెదేపా నేతలతో బాలయ్య చర్చలు

తెదేపా నేతలతో బాలయ్య చర్చలు

భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై నేతలతో హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సమాలోచనలు చేశారు. సోమవారం నాడు తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి బాలకృష్ణ వచ్చారు. మీడియా రూమ్‌లోకి వచ్చి సీనియర్ నేత యనమల ఇతర నేతలతో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్టీ నేతలను పలకరించి రాష్ట్రంలో ఈరోజు చేపట్టిన బంద్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం రెండవ అంతస్తు లోని మిని కాన్ఫరెన్స్ హల్ టీడీపీలో నేతలతో చర్చలు జరిపారు.