NRI-NRT

తానా సభల్లో గోదావరి ప్రవాసుల పరవళ్లు

Godavari NRIs Meet At TANA 2019 Convention In Washington DC

* వెటకారం-చమత్కారం-మమకారం వారి బలమన్న తాళ్లూరి జయశేఖర్
* మర్యాదలతో ప్రవాసులను ఇబ్బంది పెట్టారు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభ మూడో రోజు వేడుకల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం గోదావరి జిల్లాల ప్రవాసుల సమ్మేళనం నిర్వహించారు. చెరుకు రసం, కాజాలు, పునుగులు వంటి వంటకాలతో, గోదావరి మర్యాదలతో ప్రవాసులను మత్తుగా మచ్చిక చేసుకున్నారు. గోదావరి ప్రవాసుల సంఘం వ్యవస్థాపక సభ్యులు యంత్ర సుబ్బా సంస్థ లక్ష్యాలను, ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. తాళ్లూరి జయశేఖర్ మాట్లాడుతూ తనకు కాకినాడలో సంస్థ విభాగం ఉందని, తన వదినది గోదావరి జిల్లా అని తెలిపారు. వెటకారం-చమత్కారం-మమకారం గోదారి జిల్లాల వాళ్ల బలమని జయశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణాలో పేరు పెట్టి పిలుస్తారని, గోదావరి వెళ్తే అరేయి ఒరేయి తప్ప వేరే ఆప్యాయత కనపడదని ఆనందం వెలిబుచ్చారు. అనంతరం ఆయన్ను, ముఖ్య అతిథి గన్ని కృష్ణను నిర్వాహకులు మన్నే సత్యనారాయణ, పుసులూరి సుమంత్, చిలుకూరి రాంప్రసాద్, మేకా సతీష్ తదితరులు సత్కరించారు. కార్యక్రమంలో డా.రాజా తాళ్లూరి, లావు అంజయ్య చౌదరి, డా.జంపాల చౌదరి తదితరులు పాల్గొన్నారు.