ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా చూసిన యాపిల్ మెగా ఈవెంట్ పూర్తయింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా ‘వండర్ లస్ట్’ పేరుతో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. వీటితో పాటు యాపిల్ వాచ్‌లు ‘వాచ్ సిరీస్ 9’, ‘వాచ్ అల్ట్రా 2’ను విడుదల చేసింది. ఈ సారి టైప్-సీతో కూడిన ఛార్జింగ్‌ను ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో అమర్చారు.