తన అభినయం, డ్యాన్స్‌తో సౌత్‌లో విశేష క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది. స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది పూర్తికాకముందే జునైద్ హీరోగా మరో చిత్రం ఖరారైందని, అందులోనే హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేశారంటూ వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. ప్రేమకథా నేపథ్యంలో రూపొందనున్న ఆ సినిమాకి ఆమిర్‌కు సన్నిహితుడైన సునీల్ పాండే దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా సాయి పల్లవి ఫ్యాన్స్ నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆమీర్ ఖాన్ తనయుడి సినిమాతో బాలీవుడ్‌లోకి సాయిపల్లవి
Related tags :