WorldWonders

గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు కన్నం వేసిన కూలీలు

గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు కన్నం వేసిన కూలీలు

యునెస్కో వారసత్వ చిహ్నాలలో ఒకటైన చైనా గ్రేట్ వాల్‌కు కొందరు భవన నిర్మాణ కూలీలు పెద్ద రంధ్రం చేశారు. 38 ఏళ్ల ఇద్దరు కార్మికులు, 55 ఏళ్ల ఓ మహిళా కార్మికురాలు కలిసి ఈ విధ్వంసక పని చేశారు. వారు తమ నిర్మాణ యంత్రాలు, ఇతర వస్తువులతో పనికి వెళ్లాలంటే.. చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని.. ఆ దూరాన్ని తగ్గించుకోవటానికి ఇలా గోడకు పెద్ద రంధ్రం తవ్వారు. ఆగస్టు 24న గోడ ధ్వంసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాని ఆధారంగా క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు. భారీ యంత్రాలతో గోడను డ్రిల్లింగ్‌ మిషన్స్‌తో రంద్రం చేసినట్లు విచారణలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సమీపంలో నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను విచారించగా నేరం అంగీకరించారు. దాంతో వారిని అరెస్టు చేశారు.