Agriculture

కౌలు రైతులకు కాంగ్రెస్ వరాలు

కౌలు రైతులకు కాంగ్రెస్ వరాలు

“గతేడాది మేలో రాహుల్‌ గాంధీ వరంగల్‌ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ ప్రకారం కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద సొంత భూమి కలిగినవారితో పాటు కౌలు రైతులకు ఎకరాకు ఏటా రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీ పథకంలో పేరు నమోదు చేసుకున్న భూమి లేని రైతుకూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తాం” అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. కౌలు రైతులకు బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి రైతుబంధు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం. అందడం లేదన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు.