Devotional

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. తిరుమల జీఎన్‌సీ టోల్‌ గేట్‌ నుంచి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలోని పార్కులు, ఆస్థాన మం­డపాలు, అన్నదాన సత్రా­లు, వైకుంఠం క్యూకాం­ప్లెక్స్‌లు, మాడవీధులు విద్యుద్దీపాలంకరణతో కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రధాన సర్కిళ్లలో ఎటు చూసినా దేవతామూర్తుల భారీ కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కల్యాణ వేదిక వద్ద భక్తులకు కనువిందు చేసేలా స్వామి­వారి పాదాలను ఏర్పా­టు చేశా­రు. అనంతపద్మనాభ స్వామి నమూ­నా ఆలయాన్ని కళ్లు చెదిరేలా ఏర్పాటు చే­శా­రు. ఇసుకతో స్వా­మివారి ముఖచిత్రాల­ను కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.