తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 45 ఏళ్లుగా దోపిడీని రాజకీయంగా మార్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిడదవోలులో విమర్శించారు. ఇటీవలే అవినీతి కేసులో సాక్షాలు, ఆధారాలతో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని చెప్పారు. చంద్రబాబు అడ్డంగా దొరికినా.. ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అన్న దత్తపుత్రుడు నేరుగా జైలుకు వెళ్లి ములఖాత్‌లో మిలాఖత్ చేసుకున్నాడు అని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికినా.. చంద్రబాబు ఎన్ని దొంగతనాలు చేసిన, దోపిడీ చేసిన, వెన్నుపోటులు పొడిచిన.. ఆయనను రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన దొంగల ముఠా సభ్యులు ఉన్నారని అన్నారు. అయితే చట్టం ఎవరికైనా ఒక్కటేనని చెప్పేవారు ఇంతకాలం లేరని చెప్పారు. మాములు వ్యక్తి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో.. అధికారంలో ఉన్న వ్యక్తి కూడా తప్పు చేస్తే అలాంటి శిక్ష పడుతుందని.. చట్టం ఎవరికైనా ఒక్కటేనని చెప్పారు.
దత్తపుత్రుడు…ములాఖత్‌లో మిలాఖత్ చేసుకున్నాడు: జగన్
Related tags :