Sports

సైనాకు కీలక పదవి

సైనాకు కీలక పదవి

భారత వెటరన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. హాంగ్జౌ ఆసియా క్రీడల అథ్లెట్స్‌ కమిటీకి ఆమె ఏకగీవ్రంగా ఎన్నిక కానుంది. 10 మంది సభ్యుల ఈ కమిటీకి ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) తొలిసారి క్రీడాకారులతో ఓటింగ్‌ నిర్వహించనుంది. ఓసీఏలోని ఐదు జోన్లలో ఒక్కో జోన్‌ నుంచి ఒక పురుష, మరో మహిళా అథ్లెట్‌ను ఈ కమిటీకి ఎన్నుకోనున్నారు. 10పోస్టులకు 26 మంది పోటీపడుతున్నారు. వీరిని ఆయా దేశాల జాతీయ ఒలింపిక్‌ కమిటీలు నామినేట్‌ చేశాయి. అయితే సౌత్‌ఏషియా జోన్‌ నుంచి మహిళా అథ్లెట్‌ కోటాలో 2016 లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ మాత్రమే నామినేట్‌ అయింది. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. అక్టోబరు 7న ఆసియా క్రీడల ముంగిపు రోజున విజేతలను ప్రకటిస్తారు.