మేషం..
మరింత రాబడి పొందుతారు.సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు ముఖ్య సమాచారం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి, విస్తరించే యత్నాలు సఫలం. ఉద్యోగులు విధుల్లో సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు విదేశీయానం. వారం ప్రారంభంలో వృథా వ్యయం. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు, విష్ణుధ్యానం చేయండి.
వృషభం..
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవార్తా శ్రవణం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి. భూసంబంధిత వివాదాల పరిష్కారం. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆకుపచ్చ, తెలుపు రంగులు, లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.
మిథునం..
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి. అందరిలోనూ గుర్తింపు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. వేడుకలలో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. నిరుద్యోగుల దీర్ఘకాలిక కృషి ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు, వి«ధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు. వారం మధ్యలో దుబారా వ్యయం. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు, అంగారకస్తోత్రం పఠించండి.
కర్కాటకం..
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలించే సమయం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో దూరప్రయాణాలు. మానసిక ఒత్తిడులు. ధనవ్యయం. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు, గణేశాష్టకం పఠించండి.
సింహం..
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూములు వాహనాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉన్నత హోదాలలోని వారిని కలుసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. సోదరులతో కలహాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రం పఠించండి.
కన్య..
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కి మరింత ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి విధులు నిర్వహించే అవకాశం. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి.
తుల..
విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూవివాదాల నుంచి ఎట్టకేలకు గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారవృద్ధి, భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ప్రయాణాలు రద్దు. మానసిక ఆందోళన. నీలం, లేత పసుపు రంగులు, దుర్గాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం..
ఆర్థిక పరిస్థితిలో గందరగోళం, కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులు,స్నేహితులతో అకారణంగా తగాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల శ్రమ అంతగా ఫలించదు, సర్దుబాటు వైఖరితో ముందడుగు వేయాలి. కొందరు వ్యక్తుల ద్వారా మాటపడాల్సిన సమయం. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. కీలక నిర్ణయాలు. వాహనయోగం. నేరేడు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు..
నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యసమస్యలు కొంత కుదుటపడతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగి, లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం రావచ్చు. కళాకారులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం చివరిలో శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. వారం చాక్లెట్, ఎరుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
మకరం..
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారం. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. ఖర్చులు పెరుగుతాయి. పసుపు, గులాబీరంగులు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కుంభం..
ఆదాయం సమకూరడంలో అవాంతరాలు తొలగుతాయి. అనుకున్న వ్యవహారాలు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. సన్నిహితులు, ఆప్తుల నుండి శుభవార్తలు రావచ్చు. వాహనాలు, భూములు కొనుగోలుపై ఉన్న సందిగ్ధత తొలగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాభావం పెంచుకుంటారు. అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. గులాబీ, లేత ఎరుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మీనం..
అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. బంధువులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా నిలుస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు పర్యటనలు విజయవంతంగా ముగుస్తాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. తెలుపు, ఎరుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.