అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సిలోని స్టేట్ క్యాపిటల్ వద్ద ఎన్నారై టీడీపీ ప్రతినిధులు జయరాం కోమటి, సతీష్ వేమన ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనైతిక అరెస్ట్ ను నిరసిస్తూ ప్రజానిరసన కార్యక్రమం నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జయరాం కోమటి మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం కక్ష పూరిత విధానాలతో సాగుతుందని, కనీస సమాచారం గవర్నర్ కు కూడా లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయటం దుర్మార్గమని అన్నారు. సతీష్ వేమన మాట్లాడుతూ.. అధికారం చేతిలో ఉందని ప్రభుత్వ అక్రమ కేసులు బనాయించినా చట్టాలను గౌరవించి, న్యాయస్థానం సాక్షిగా చంద్రబాబు నిర్దోషిగా నిలబడతారని తెలిపారు.
భాను మాగులూరి, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, అనిల్ ఉప్పలపాటి, రవి అడుసుమిల్లి, శ్రీనివాస్ కూకట్ల, సత్య, త్రిలోక్, చౌదరి యలమంచిలి, వెంకట్ దనియాల, డాక్టర్ పద్మ, కల్పన, కృష్ణ లామ్,ప్రదీప్ గౌర్నేని, నెహ్రు, వేణు, శ్రీకాంత్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.