తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు పై స్కాట్లాండ్ ఎన్నారైలు నిరసన తెలియచేసారు. స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ నగరం లో జరిగిన కార్యక్రమం లో వంద మందికి పైగా ఎన్నారైలు పాల్గొని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో తాము ఎలా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొని జీవితం లో ఉన్నత స్థితి పై చేరుకున్నామో గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అప్రజాస్వామిక, కక్షపూరిత పరిపాలన వల్ల తమ మాతృభూమి అభివృద్ధి తిరోగమనం లో వెళ్ళటం పై తమ ఆందోళన వ్యక్తం చేసారు. చంద్రబాబు లాంటి మరో నాయకుడిని తమ జీవితం లో మరొకరిని చూడలేమని, ఈ సమయం లో చంద్రబాబుకు అండగా నిలబడలేకపోతే ఈ అక్రమాలు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులదాకా వచ్చినప్పుడు వారికి అండగా నిలబడటానికి ఎవరూ ఉండరని ఉద్ఘాటించారు. తెదేపా శాసన సభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్ వీడియో కాల్ ద్వారా ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురామకృష్ణం రాజు తన వీడియో సందేశం ద్వారా తన సంఘీభావాన్ని తెలియచేసారు.
కార్యక్రమం లో పాల్గొన్న ఎన్నారైలు ప్రస్తుత పాలకుల వ్యవహార శైలిని, వారి నియంత్రణ లో ఉన్న వివిధ వ్యవస్థల పనితీరుని చర్చించి రాజమండ్రి జైలు లో ఉన్న చంద్రబాబు నాయుడు భద్రత పై ఆందోళన వ్యక్తం చేసారు. చంద్రబాబు భద్రత పై తమ ఆదోళన ని తెలియచేస్తూ ఎడిన్బర్గ్ నగరం లో భారత కాన్సులేట్ జనరల్ కు లేఖ సమర్పించాలని తీర్మానించారు. కార్యక్రమం లో డా. శ్రీకాంత్ లావు, గోల్కొండ రమేష్, పొట్లూరు కృష్ణప్రసాద్, అమర్ గుత్తా, స్కాట్లాండ్ తెలుగు సంఘం ప్రతినిధి కెంబూరి మైథిలి మరియు వక్తలు ప్రసంగించారు.
చంద్రబాబు కోసం కదిలిన స్కాట్ల్యాండ్ ప్రవాసులు
Related tags :