Sports

Asia Games 2023: దారుణంగా ఓడిన ఇండియా

Asia Games 2023: దారుణంగా ఓడిన ఇండియా

ఆసియా క్రీడలను భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ఘోర పరాజయంతో ఆరంభించింది. మంగళవారం ఆతిథ్య చైనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-5 తేడాతో ఓటమిపాలైంది. ప్రయాణం చేసి అలసిపోవడం, సరైన సన్నద్ధతలేమి, వేడి వాతావరణం కారణంగా భారత ఆటగాళ్లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. భారత్ తరఫున రాహుల్ కేపీ (45+1) నిమిషంలో గోల్ చేయడంతో ఆట మొదటి అర్ధ భాగం 1-1తో ముగిసింది. రెండో అర్ధ భాగంలో చైనా ఆటగాళ్లు ఏకంగా నాలుగు గోల్స్‌ చేశారు. ఆతిథ్య జట్టు తరఫున గియావో తియానీ (17 నిమిషం), డై వీజున్ (51 నిమిషం), టావో కియాంగ్‌లాంగ్ (72, 75 నిమిషం), హావో ఫాంగ్ (90+1 నిమిషం)లో గోల్స్ చేశారు.భారత్ రెండో రౌండ్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, మయన్మార్‌లను ఓడించాలి.