* దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో వరుసగా రెండోరోజూ నష్టాలు నమోదయ్యాయి. గత రెండు వారాలుగా మన సూచీలు అంతర్జాతీయ సూచీలతో సంబంధం లేకుండా పరుగులు తీశాయి. తాజాగా ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల వాతావరణంతో ·నష్టాలు నమోదయ్యాయి. దీంతో భారీ లాభాల జోరుకు బ్రేక్ పడింది. ఫలితంగా సెన్సెక్స్ 67,000, నిఫ్టీ 20,000 కీలక మైలురాళ్ల నుంచి వెనక్కి వచ్చాయి. ఉదయం సెన్సెక్స్ (Sensex) 67,080.18 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66,728 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 796 పాయింట్ల నష్టంతో 66,800.84 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,980.75 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,878.85 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 231.90 పాయింట్లు నష్టపోయి 19,901.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.09 వద్ద నిలిచింది.
* భారత్‌లో వ్యాపారుల కోసం వాట్సప్ (Whatsapp) మాతృ సంస్థ మెటా (Meta) కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ముంబయిలో జరిగిన మెటా రెండో వార్షిక సమావేశంలో ఈ టూల్స్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Zuckerberg) వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్‌లోని ప్రజలు, వ్యాపారులు వాట్సప్‌ను సమర్థంగా వినియోగించి పనులు చక్కబెట్టుకొంటున్నారని కొనియాడారు. ఈ విషయంలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మెటా తీసుకొచ్చిన కొత్త వాట్సప్ ఫీచర్లను జుకర్‌బర్గ్ పరిచయం చేశారు. మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్, వాట్సప్ చాట్‌లోనే పేమెంట్‌ను సైతం పూర్తి చేసే సదుపాయం తీసుకొస్తున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. అలాగే కొత్తగా వాట్సప్‌లో ‘ఫ్లోస్’ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయం ద్వారా చాట్ థ్రెడ్స్‌లోనే వినియోగదారులకు కావాల్సిన సేవలను అందించొచ్చని పేర్కొన్నారు.
* గో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ రైట్స్‌పై దివాలా కోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. దీంతో ప్రభుత్వం కూడా కంపెనీ ఫ్లయింగ్ రైట్స్‌ను ఇతర ఎయిర్‌లైన్ కంపెనీలకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. దీంతో పాపులర్ రూట్లలో విమాన సర్వీస్‌లు తగ్గిపోతాయని, టికెట్ రేట్లు మరింత పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫెస్టివల్, వింటర్ సీజన్లో డిమాండ్ బాగుంటుందని, దీంతో రేట్లు భారీగా పెరుగుతాయని వెల్లడించాయి. ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ రైట్స్‌ను ప్రభుత్వం కేటాయిస్తుంది. కేటాయించిన దానికంటే ఎక్కువ విమానాలను కంపెనీలు ఆపరేట్ చేయడానికి వీలుండదు. దివాలా తీయకముందు థాయ్‌ల్యాండ్, అబుదాబి, సింగపూర్, ఒమన్ వంటి ఇంటర్నేషనల్ డెస్టినేషన్లకు గో ఫస్ట్ సర్వీస్‌లు నడిపేది. థాయ్‌లాండ్‌కు వారానికి 8 వేల సీట్లు, మలేషియాకు 3 వేల సీట్లు, అబుదాబికి 9 వేల సీట్లు, సింగపూర్‌కు 1,200 సీట్లు కంపెనీ పొందిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.
* ఏరోస్పేస్ హై ప్రెసిషన్ గేర్స్, గేర్ బాక్సెస్ తయారీ కోసం స్కంద ఏరోస్పేస్ కొత్త మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. డొమెస్టిక్ ఎయిర్‌క్రాఫ్ట్స్, హెలికాప్టర్లు, గ్లోబల్ కమర్షియల్ ఏవియేషన్ మార్కెట్ కోసం గేర్స్, గేర్‌బాక్సుల తయారీకి రూ. 75 కోట్ల ఖర్చుతో ఈ కొత్త ఫెసిలిటీ ప్రారంభించినట్లు స్కంద ఏరోస్పేస్ వెల్లడించింది. రాబోయే 2–3 ఏళ్లలో మరో రూ. 150 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. అమెరికా కంపెనీ రేవ్ గేర్స్, హైదరాబాద్ కంపెనీ రఘువంశీ మెషిన్ టూల్స్ కలిసి స్కంద ఏరోస్పేస్ను నెలకొల్పాయి. స్కంద ఏరోస్పేస్‌కు ఏటా 9 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు ఇవ్వడానికి రేవ్గేర్స్ ఒప్పుకుందని కంపెనీ పేర్కొంది. మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలో ప్రస్తుతం 150 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ సంఖ్యను మూడేళ్లలో వెయ్యికి పెంచుతారు.
* కొల్లీర్స్ ఇండియా రిపోర్టు ప్రకారం.. భూమిపై పెట్టుబడి కోసం టాప్-5 ఎమర్జింగ్ కారిడార్లలో హైదరాబాద్‌లోని కొంపల్లి-మేడ్చల్-షామీర్పేట్ ఉన్నది. మిగతా వాటిలో మహారాష్ట్రలోని నేరళ్-మాథేరన్, గుజరాత్‌లోని సనంద్-నల్సరోవర్, చెన్నై సమీపంలోని ఈసీఆర్-ఇంజాబక్కమ్-కోవళం, కోల్‌కతా దగ్గర్లోని న్యూ టౌన్-రాజర్హట్ ఉన్నాయి. ఇక్కడి భూముల్లో పెట్టుబడులు పెడితే వచ్చే దశాబ్ద కాలంలో ఐదు రెట్లు లాభాలను అందుకోవచ్చని మదుపరులు భావిస్తున్నట్టు కొల్లీర్స్ తెలిపింది.
* చారిటబుల్ ట్రస్టులు, మతపరమైన సంస్థలు, వృత్తిపరమైన సంఘాలకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ.. ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువును పెంచింది. నవంబర్ 30దాకా అవకాశమిచ్చింది. అలాగే 2023-24 మదింపు సంవత్సరం కోసం ఫామ్ ఐటీఆర్-7లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ తెలియపర్చుటకున్న ఆఖరు తేదీని, కంపెనీల ఐటీఆర్ ఫైలింగ్కున్న గడువును నవంబర్ 30కి పొడిగించారు. ఇక 2022-23కుగాను ఫండ్స్, ట్రస్టులు, ఇన్స్టిట్యూషన్ల కోసం ఫామ్ 10బీ/10బీబీల్లో ఆడిట్ రిపోర్టుల సమర్పణకున్న గడువునూ అక్టోబర్ 31 వరకు పెంచారు.
* కొద్ది నెలలుగా ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి సమీపానికి తగ్గినప్పుడల్లా కోలుకుంటూవచ్చిన రూపాయి.. తాజాగా రికార్డు స్థాయిలో పతనమయ్యింది. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 83.29 స్థాయిని వదులుకుని మరింత దిగువకు జారిపోయింది. సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో 83.09 వద్ద ప్రారంభమైన భారత కరెన్సీ.. క్రమేపీ క్షీణించి 83.32 వద్దకు పడిపోయింది. అంతక్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 16 పైసలు తగ్గింది. శుక్రవారం కూడా 13 పైసలు నష్టపోయింది. దీంతో వరుసగా రెండు రోజుల్లో 29 పైసల నష్టాన్ని చవిచూసినైట్టెంది. రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వ బ్యాంక్‌ల సాయంతో డాలర్లను విక్రయించి, రూపాయికి మద్దతు ఇచ్చినప్పటికీ రుపీ నిలువలేదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు.