శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం సింహవాహన సేవ జరగ్గా.. రాత్రి ముత్యపు పందిరి వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలేశుడు కాళీయమర్ధనుడి అవతారంలో అభయ ప్రదానం చేశారు. శ్రీవారి వాహన సేవకు ముందు వివిధ కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు.
ముత్యపు పందిరి వాహనంపై శ్రీనివాసుడు
Related tags :