డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌కు హైకోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతను వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. 41 ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇచ్చి విచారణ జరపవచ్చని తెలిపింది. అలాగే డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలని నవదీప్‌ను ఆదేశించింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తన పేరు బయటకురావడంతో ఇటీవల నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారని, డ్రగ్స్ వినియోగదారుల జాబితాలో తనను కూడా అన్యాయంగా ఇరికించారంటూ నవదీప్ హైకోర్టులో సెప్టెంబర్ 15న పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సెప్టెంబర్ 19వ తేదీ వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇవాళ నవదీప్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.
నవదీప్‌కు హైకోర్టు షాక్. విచారణకు హాజరు తప్పనిసరి.
Related tags :