Politics

నేడు ఏసీబీ కోర్టు ఎదుటకు చంద్రబాబు

నేడు ఏసీబీ కోర్టు ఎదుటకు చంద్రబాబు

నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అరెస్టైన చంద్రబాబుకు న్యాయస్థానం విధించిన జ్యుడీషియల్‌ రిమాండు శుక్రవారంతో ముగియనుంది. దీంతో తదుపరి ఆదేశాల కోసం ఆయన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో నేడు హాజరు పరచనున్నారు. మరోవైపు చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజే తీర్పు వెలువడనుంది. 8 మంది వైద్య సిబ్బందితో బృందం…: చంద్రబాబు కోసం 8 మంది వైద్యాధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం శుక్రవారం ఉదయం 8.30 గంటలకల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని క్యాజువాలిటీ వద్ద హాజరుకావాలని ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ.లక్ష్మీసూర్యప్రభ గురువారం ఆదేశాలు జారీచేశారు. అత్యవసర మందులు, రెండు యూనిట్ల ఓ పాజిటివ్‌ రక్తాన్ని సిద్ధంగా ఉంచుకుని చంద్రబాబును ఫాలో అవ్వాలని సూచించారు. కాన్వాయ్‌ టీం, ఇద్దరు అంబులెన్స్‌ డ్రైవర్లు… అంబులెన్స్‌లు సహా కేంద్ర కారాగారం వద్ద రాజమహేంద్రవరం సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీకి రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.