చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అమెరికాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్లోరిడా రాష్ట్రంలోని టాంపాలో ఎన్.ఆర్.ఐ టీడీపీ ఆధ్వర్యంలో నేనుసైతం బాబు కోసం అంటూ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువకులు, టీడీపీ సానుభూతిపరులు, స్థానిక తెలుగు వారు, ఐటీ ఉద్యోగులు తరలి వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శించి సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. తాము ఈ రోజు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నామంటే దానికి కారణం చంద్రబాబే అని ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారు తెలిపారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి లక్షలాది మంది తెలుగు వారు ఐటీలో స్థిరపడేలా చేశారన్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే చంద్రబాబును విడుదల చేయాలని ఎన్.ఆర్.ఐ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
టాంపాలో ఎన్నారై తెదేపా నిరసన
Related tags :