ScienceAndTech

26న సూర్యాపేటలో ఉద్యోగ మేళా

26న సూర్యాపేటలో ఉద్యోగ మేళా

సూర్యాపేటలో సెప్టెంబరు 26న ఐటీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను టాస్క్‌ (Telangana Academy for Skill and Knowledge) అధికారులతో కలిసి హైదరాబాద్‌లో ఆయన విడుదల చేశారు. సూర్యాపేటలో ఐటీ హబ్‌ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేశారని అన్నారు. అక్టోబర్‌ 2న ఆయన చేతుల మీదుగా ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నట్లు జగదీశ్‌ రెడ్డి తెలిపారు. పాత కలెక్టరేట్‌లో 8 కంపెనీలతో ఐటీ టవర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల ఐటీ టవర్‌ తొలి దశలో 180 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.