తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వెల్స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్.. తన తయారీ యూనిట్ ను రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం చందన్పల్లిలో ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు వెయ్యి ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ తయారీ కేంద్రం నుంచి సింటెక్స్ వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపొనెంట్స్ ఇతర పరికరాలు తయారు చేయనున్నారు. ఈనెల 28న వెల్స్పన్ కంపెనీ ఛైర్మన్ బీకే గోయెంకా, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది.