ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్ లో దిల్ సే స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మొదటి సారిగా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో వినాయకుణ్ణి భక్తుల సమక్షంలో ఊరేగించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాంసృతిక కార్యక్రమాలు, భజనలు, నృత్యాలు, పాటల కార్యక్రమాలతో సందడి గా నిర్వహించారు. అశేషంగా హాజరైన భక్తుల సమక్షంలో వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు. విదేశాల్లో కూడా భారతీయ సంసృతిని ఎన్‌ఆర్‌ఐ లు మరవకుండా ఇటువంటి గొప్ప సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని దిల్ సే అధ్యక్షుడు హర్ష రెడ్డి అన్నారు.
మెల్బోర్న్‌లో మహాగణపతి నిమజ్జనం
Related tags :