రాజా రవివర్మ 175వ జయంతి, జైపూర్ వాచ్ కంపెనీ పదో వార్షికోత్సవం.. రెండు ప్రత్యేక సందర్భాలనూ పురస్కరించుకుని జైపూర్ ప్యాలెస్ వేదికపై రవివర్మ కలెక్షన్‌ను ఆవిష్కరించారు. రవి వర్మ పేరు వింటేనే.. శకుంతల, మనోరమ, చిత్రలేఖ, ద్రౌపది, లక్ష్మి, సరస్వతి.. తైలవర్ణ చిత్రాలు మనోనేత్రంలో మెదులుతాయి. రవివర్మ తైలవర్ణ చిత్రాల్లోని ఆ ఇతిహాస ఘట్టాలను లగ్జరీ వాచీల్లో ఇమిడ్చేందుకు జైపూర్ వాచ్ కంపెనీ అధినేత గౌరవ్ మెహతా సుదీర్ఘ ప్రయత్నాలు చేశారు. ఇందులో ఎక్కువగా సచిన్ కలుస్కర్ అనే వ్యక్తి సేకరించినవే ఎక్కువ. కిలిమనూర్ ప్యాలెస్ ట్రస్ట్ అందించినవీ ఉన్నాయి. రవివర్మ చిత్రాలను ఫొటోలుగా వాచీలపై ముద్రించేందుకు జపాన్ నుంచి ఓ ప్రత్యేకమైన ప్రింటర్‌ను దిగుమతి చేసుకున్నారు. ఆ వర్ణ విశేషాలన్నిటినీ వాచీ డయల్ సైజ్‌లో అచ్చు తీయడం మొదట సాధ్యపడలేదు. అనుకున్నట్లుగా చిత్రాలు రాలేదు. ముద్రణ సమస్యలతో అడుగు ముందుకు పడలేదు. ఆ సందర్భంలో ఒక ఉద్యోగి చొరవ చేసి, వైట్ డయల్‌ని చేర్చిన తర్వాత అద్భుతంగా ప్రింట్ అయ్యాయి. మొత్తానికి ఏడు నెలలు కృషి ఫలించి గౌరవ్ కలలు నెలవేరాయి. 40 మిల్లీ మీటర్ల డయల్‌లో రవివర్మ చిత్రాలను చక్కగా ముద్రించగలిగారు. ఈ సిరీస్‌లో వాచీల ధర 65 వేల నుంచి మొదలవుతుంది.
రవివర్మ తైలవర్ణ చిత్రాలతో వాచీలు. ప్రారంభ ధర ₹65వేలు.
Related tags :