DailyDose

కృషి బ్యాంకు డైరక్టర్ అరెస్ట్-నేరవార్తలు

కృషి బ్యాంకు డైరక్టర్ అరెస్ట్-నేరవార్తలు

* కృషి కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కృషి బ్యాంకు ఛైర్మన్‌, డైరెక్టర్లు 2001లో రూ.36.37 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిపై 2001 ఆగస్టు 11న మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే నెలలో ఈ కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. దీనిపై నాంపల్లి కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది.

* తీగ లాగితే డొంక కదిలినట్లు.. డోన్ పోలీసులకు దొరికిన బీహార్ దొంగల ముఠాను పోలీసులు తమదైన స్టైల్ లో విచారిస్తే నివ్వురు గప్పే నిజాలు వెల్లడించడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ కు గురయ్యారు. వారు చెప్పిన వివరాలతో అన్ని రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్ ఏటీఎం దొంగలు యదేచ్చగా రెక్కీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. జనసంచారం లేని ఏటీఎం సెంటర్లపై ఎక్కువగా రెక్కీ నిర్వహిస్తారు. ఆ ప్రాంతాల్లో జన సందోహాలు ఏ సమయానికి నిర్మానుష్యంగా మారుతాయి. ఏటీఎంలో ఎంత నగదు జమ చేస్తున్నారో రెక్కీ నిర్వహించి ఇట్లే పసిగట్టేస్తారు. ఏటీఎం చోరీకి ఎలాంటి ఆయుధాలు ఉపయోగించాలో చోరికి బయలు దేరే ముందే నిర్ణయించు కుంటారు. రెక్కీ టీం చోరీ చేసే బీహార్ గ్యాంగ్ కి వీరి సమాచారం మేరకు అక్కడి నుండి బయలు దేరి పోలీసుల కళ్ళు కప్పి రాష్ట్ర, అంతర్ రాష్ట్ర చెక్‌ పోస్టులను సులువుగా దాటివేస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి బీహార్ గ్యాంగ్ చొరబడుతున్నారు.

* నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి మృతి చెందింది. తనను ప్రేమించాలంటూ రెండ్రోజుల కిందట యువతిని ఓ యువకుడు తీవ్రంగా కొట్టి పరారయ్యాడు. దీంతో గాయపడిన యువతి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. నిందితుడు గౌసుద్దీన్‌పై యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. జక్రాన్‌పల్లిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

* మెద‌క్ జిల్లాలోని మ‌నోహ‌రాబాద్ మండ‌లం రంగాయ‌ప‌ల్లిలో విషాదం నెల‌కొంది. ముగ్గురు మ‌హిళ‌లు, ఒక బాలుడు చెరువులో ప‌డి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ముగ్గురు మ‌హిళ‌లు, బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మృత‌దేహాల‌ను చెరువులో నుంచి బ‌య‌ట‌కు వెలికితీశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

* తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని దళిత మహిళపై ఓ వ్యక్తి అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడు. ఆమెను వివస్త్రను చేసి దాడి చేశాడు. ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఈ అమానుష ఘటన బిహార్‌ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. పట్నా జిల్లా మోసిమ్‌పుర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త.. స్థానికంగా పలుకుబడి ఉన్న ప్రమోద్‌ సింగ్‌ వద్ద కొన్ని నెలల క్రితం రూ.1500 అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా.. అదనపు వడ్డీ ఇవ్వాల్సిందేనని ప్రమోద్‌ సింగ్‌ డిమాండ్ చేశాడు. అందుకు వారు అంగీకరించలేదు. దీంతో ఆ దంపతులపై కోపం పెంచుకున్న ప్రమోద్‌.. గతవారం సదరు మహిళకు ఫోన్‌ చేసి బెదిరించాడు. అదనపు వడ్డీ ఇవ్వకపోతే గ్రామంలో నగ్నంగా ఊరేగిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.