NRI-NRT

న్యూ ఇంగ్లాండ్‌లో “తానా కళాశాల” పరీక్షలు

న్యూ ఇంగ్లాండ్‌లో “తానా కళాశాల” పరీక్షలు

“తానా కళాశాల” కార్యక్రమం ద్వారా భారతీయ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం కోర్సులకు ప్రచారం కల్పిస్తున్నారు. అమెరికావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. న్యూఇంగ్లండ్ ప్రాంతంలో పరీక్షలు నిర్వహించారు. 40మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన పర్యవేక్షకులు పరీక్ష సరళిని గమనించారు. పరీక్ష ఫలితాల అనంతరం విద్యార్థి స్థాయి ఆధారంగా డిగ్రీ అందిస్తారు. కె.పి.సోంపల్లి, వాలంటీర్లు గీతా జమ్ముల, రేఖ గుండిమెడ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్ శశికాంత్ వల్లేపల్లి, తానా కళాశాల చైర్మన్ రాజేష్ అడుసుమిల్లి, ఉపాధ్యాయురాలు శైలజ ఈడుపుగంటిలకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

న్యూ ఇంగ్లాండ్‌లో