జాక్స్ గణేష్ యువ మండల్ (Jax Ganesh Yuva Mandal-JGYM) ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమెరికాలో భారతీయ సాంప్రదాయలకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో స్వామివారి లడ్డూ ప్రసాదం, వస్త్రాలకు వేలంపాట నిర్వహించారు. నలజల వెంకట్-కళ్యాణిలు పెద్దలడ్డూను, కల్లూరి సుబ్బారావు చిన్నలడ్డూను, అబ్బూరి తిరుమల, గుమ్మడి దుర్గలు వస్త్రాలను దక్కించుకున్నారు. జాక్సన్విల్ భారతీయ సమాజంలో వినాయక చవితి ద్వారా ప్రవాసులు అందరూ భాగస్వామ్యం అయ్యేలా ఉత్సవాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.