Business

SBIకు ₹1.3కోట్ల జరిమానా-వాణిజ్యం

SBIకు ₹1.3కోటి జరిమానా-వాణిజ్యం

* ప్రతి ఒక్కరూ తమ కుటుంబం, పిల్లల భవిష్యత్ కోసం తమ సంపాదనలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. అలా పొదుపు చేసే చిన్న మొత్తాల పొదుపు పథకాలు కూడా ఉన్నాయి. ఈ పథకాల్లో నిధులు మదుపు చేస్తున్న వారు తప్పనిసరిగా ఆధార్ పాన్ కార్డు సబ్మిట్ చేయాలి.ఈ నెలాఖరులోగా వారు తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు 2023 మార్చి 31నే కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గడువులోపు సమర్పించని వారి ఖాతాలను స్తంభింపజేస్తారు. తిరిగి పాన్, ఆధార్ పత్రాలు సమర్పించే వరకూ ఆయా ఖాతాల నిర్వహణ నిలిచిపోవడంతోపాటు లావాదేవీలు జరుపడానికి ఆస్కారం ఉండదు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసిన ఖాతాదారులు ఇప్పటికే పాన్, ఆధార్ సమర్పించి ఉంటే మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారు పాన్, ఆధార్ సమర్పించడం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తప్పనిసరి చేసింది. కనుక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పథకాల్లో కొత్తగా ఖాతాలు ప్రారంభించిన వారు పాన్, ఆధార్ కార్డులు సమర్పించాల్సిన అవసరం లేదు.

* జాబ్ క‌ట్స్‌పై ఉద్యోగుల‌కు సిటీ గ్రూప్‌ విస్ప‌ష్ట సంకేతాలు పంపింది. గ్రూప్‌లో తాను చేప‌ట్టిన ప్ర‌క్షాళ‌న‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల‌ని లేదంటే సంస్ధ‌ను వీడాల‌ని 2,40,000 మంది బ్యాంక్ ఉద్యోగుల‌ను సిటీగ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేన్ ఫ్రేజ‌ర్ హెచ్చ‌రించారు. జేన్ వార్నింగ్‌తో మ‌రోసారి ఉద్యోగుల‌ను లేఆఫ్స్ భ‌యం వెంటాడుతోంది. 15 ఏండ్ల‌లో అతిపెద్ద పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌ను ఆమె ప్ర‌క‌టించిన కొద్దిరోజుల‌కే ఉద్యోగుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గ‌త‌వారం జ‌రిగిన టౌన్ హాల్ మీటింగ్‌లో జేన్ మాట్లాడుతూ ఉద్యోగులంతా అప్ర‌మ‌త్తం కావాల‌ని, బ్యాంక్ కోసం మ‌నం అత్యున్న‌త ఆశ‌యాల‌తో ముందుకెళుతున్నామ‌ని, ఈ వేగ‌వంత‌మైన ప్ర‌యాణంలో త్వ‌రిత‌గ‌తిన త‌మ‌తో ప‌య‌నించాల‌ని ఆమె కోరారు. బ్యాంకు క్లైంట్స్ ఆర్డ‌ర్ల‌ను గెలుచుకునేందుకు, మార్పుల‌ను చేప‌ట్టేందుకు త‌మ‌తో క‌లిసి న‌డ‌వాల‌ని లేదంటే రైలు దిగి వెళ్ల‌వ‌చ్చ‌ని ఆమె ఉద్యోగుల‌కు తేల్చిచెప్పారు.

* దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. నిన్న మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం నష్టాలతోనే మొదలైన స్టాక్‌ మార్కెట్లు.. ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 66,071.63 దగ్గర స్వల్ప నష్టాలతో మొదలైంది. ఇంట్రాడేలో 65,865.63 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు సెన్సెక్స్‌ 78.22 పాయింట్లు పతనమై.. 65,545.47 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 9.80 పాయింట్లు తగ్గి 19,664.70 వద్ద ముగిసింది.

* రేషన్‌ కార్డుకు.. బ్యాంక్‌ ఖాతాలకు.. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు.. ఆర్థిక కార్యకలాపాలకు.. గ్యాస్‌ సబ్సిడీలకు.. ఓటేసేందుకు.. మొబైల్‌ సిమ్‌కు.. చివరకు జనన, మరణాలకు.. ఇలా అన్నింటికి ‘ఆధార్‌’ ఒక్కటే ఆధారం. దేన్ని ధ్రువీకరించాలన్నా ఇది తప్పనిసరి. అయితే దేశంలో ఇంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆధార్‌ను.. ప్రస్తుత విధానాన్ని దండగగా పేర్కొన్నది ప్రముఖ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌. ఈ 12 అంకెల బయోమెట్రిక్‌ టెక్నాలజీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందంటూ హెచ్చరించింది మరి. నిజానికి దాదాపు ఏడాదిన్నర క్రితం భారతీయ అత్యున్నత ఆడిటర్‌.. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సైతం ఆధార్‌ లోపాలను ఎత్తిచూపడం గమనార్హం. డాటా నిర్వహణ లోపభూయిష్టంగా ఉందంటూ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) పనితీరుపట్ల తీవ్ర అసంతృప్తినే వ్యక్తం చేసింది.

* రాబోయే పండుగ సీజన్‌లో 81 శాతం వినియోగదారులు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేందుకే ఇష్టపడుతున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. అంతేగాక ఈసారి గతంతో పోల్చితే మరింత ఎక్కువగా కొనుగోలు చేస్తామని ప్రతీ ఇద్దరిలో ఒకరు అంటున్నట్టు అది తెలిపింది. నీల్సన్‌ మీడియా ద్వారా అమెజాన్‌ ఇండియా ఈ సర్వేను చేపట్టింది. దేశంలోని మెట్రో నగరాలతోపాటు ఇతర నగరాలు, ప్రథమ-ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని 8,159 మంది కస్టమర్ల అభిప్రాయాలను సేకరించారు. మెట్రో నగరాల్లోని 87 శాతం మంది, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని 86 శాతం మంది ఈసారి పండుగ షాపింగ్‌ ఆన్‌లైన్‌ వేదికగానే చేస్తామన్నట్టు సర్వే పేర్కొన్నది.

* వివిధ నియంత్రణాపరమైన నిబంధనల్ని ఉల్లఘించినందుకు ఎస్బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌లకు పెనాల్టీలు విధించినట్టు రిజర్వ్‌బ్యాంక్‌ సోమవారం తెలిపింది. రుణాలు, అడ్వాన్సులపై ఆర్బీఐ జారీచేసిన కొన్ని ఆదేశాల్ని, ఇంట్రాగ్రూప్‌ లావాదేవీలపై మార్గదర్శకాల్ని పాటించనందున స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై రూ.1.3 కోట్ల జరిమానా వేసినట్టు కేంద్ర బ్యాంక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.