WorldWonders

కుక్క కోసం అధికార దర్ప ప్రదర్శన. ఊడిన IAS ఉద్యోగం.

కుక్క కోసం అధికార దర్ప ప్రదర్శన. ఊడిన IAS ఉద్యోగం.

దిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియం సాయంత్రం ఏడు గంటల వరకు క్రీడాకారులు, శిక్షకులతో బిజీగా ఉంటుంది. ఏడాది కిందట.. దిల్లీలో పనిచేస్తున్న ఈ ఐఏఎస్‌ జంట తమ పెంపుడు కుక్కతో వాకింగు చేసేందుకు స్టేడియంను ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. వీరి ఆదేశాల మేరకు స్టేడియం నిర్వాహకులు నిర్ణీత సమయం కంటే ముందే క్రీడాకారులను బయటకు వెళ్లగొట్టేవారు. ఆ తర్వాత ఈ అధికారులిద్దరూ పెంపుడు కుక్కతో అక్కడకు చేరుకొని తాపీగా వాకింగు చేసేవారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో గతేడాది మే నెలలో ప్రభుత్వం స్పందించింది. భార్యాభర్తలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది. తాజాగా ఆ ఇద్దరిలో రింకూపై వేటు వేసింది. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 1994 బ్యాచ్‌ అధికారిణి రింకూ దుగ్గా (54)ను ప్రభుత్వం బలవంతంగా ఉద్యోగం నుంచి సాగనంపింది. ఈ మేరకు పదవీ విరమణ చేయాల్సిందిగా ఆమెను ఆదేశించినట్లు అధికారవర్గాలు బుధవారం తెలిపాయి.