వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఓటమి ఖాయమని.. రాబోయేది తమ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. నాలుగో విడత వారాహి యాత్రను కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ధ్వజమెత్తారు. ‘‘వైకాపా ప్రభుత్వాన్ని దించడమే మా లక్ష్యం. వైకాపా ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ఎక్కడ? జగన్ అద్భుతమైన పాలకుడైతే నాకు రోడ్డుపైకి వచ్చే అవసరమే లేదు. డబ్బు, భూమి మీద నాకు ఎప్పుడూ కోరిక లేదు. నా నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్‌తో గొడవ పెట్టుకున్నా. ఈ పదేళ్లలో మా పార్టీ అనేక దెబ్బలు తింది. ఆశయాలు, విలువల కోసం మేం పార్టీ నడుపుతున్నాం. యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటా. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వమని చెప్పా. మనకు పార్టీల కంటే ఈ రాష్ట్రం చాలా ముఖ్యం. రాష్ట్ర యువత.. ఎంతో విలువైన దశాబ్ద కాలం కోల్పోయారు. కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక ప్రక్రియలోనూ అనేక ఇబ్బందులు ఉన్నాయి.
తెదేపా-జనసేన ప్రభుత్వం ఖాయం
Related tags :