ఏషియన్ గేమ్స్ 2023లో ఇవాళ (అక్టోబర్ 1) హైడ్రామా చోటు చేసుకుంది. మహిళల 100 మీటర్స్ హర్డిల్స్‌లో చైనా అథ్లెట్ వు యన్ని నిర్ణీత సమయానికంటే ముందే పరుగు ప్రారంభించి రెండో స్థానంలో నిలిచినప్పటికీ డిస్క్వాలిఫై అయ్యింది. తద్వారా ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీకి రజత పతకం దక్కింది. ఈ పోటీలో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన యర్రాజీ చైనా అథ్లెట్ చేసిన తప్పిదం కారణంగా లయ తప్పి రజతంతో సరిపెట్టుకుంది. చైనా అథ్లెట్ రేస్ ప్రారంభానికి ముందే పరుగు ప్రారంభించగా.. ఆమె పక్కనే ఉన్న జ్యోతి యార్రాజీ సైతం రేస్ అధికారికంగా ప్రారంభమైందని అనుకుని పరుగు మొదలుపెట్టింది. రేస్ పూర్తయిన అనంతరం అంపైర్లు పలు మార్లు రేస్ ఫుటేజ్‌లను పరిశీలించి, చైనా అథ్లెట్‌ను అనర్హురాలిగా ప్రకటించారు. ఈ విషయంలో జ్యోతి యర్రాజీ ఉద్దశపూర్వకంగా ఎలాంటి తప్పిదం చేయలేదని నిర్ధారించుకుని ఆమెకు రజతం ప్రకటించారు నిర్వహకులు. ఏదిఏమైనప్పటికీ చైనా అథ్లెట్ చేసిన తప్పిదం కారణంగా మన విశాఖ అమ్మాయి ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. యర్రాజీ సాధించిన పతకంతో ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 52కు (13 స్వర్ణాలు, 20 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది.
విశాఖ అమ్మాయికి ఏషియన్ క్రీడల్లో రజతం
Related tags :