NRI-NRT

సౌదీలో దీపావళి వేడుక

సౌదీలో దీపావళి వేడుక

సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో కాన్సులేట్ ఆడిటోరియంలో నవంబర్ 10న శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నట్లు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) వ్యవస్థాపక అధ్యక్షులు మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిద్దా భారత రాయబార కార్యాలయం కాన్సుల్ జనరల్ మహ్మద్ షాహిద్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొంటారని ‘సాటా’ వెస్ట్రన్ రీజియన్ ప్రధాన కార్యదర్శి కుద్రత్ మీర్జా తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి నృత్యాలతో పాటు దాండియా, పాటలు ఉంటాయని ‘సాటా’ వెస్ట్రన్ రీజియన్ సాంస్కృతిక ఉపాధ్యక్షురాలు లక్ష్మీ నాగరాజ్ తెలిపారు. అతిథులకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ‘సాటా’ వెస్ట్రన్ రీజియన్ అధ్యక్షుడు నరేష్ తెలిపారు.