Devotional

శ్రీవారి దర్శనం సమయం ఎంతంటే?

శ్రీవారి దర్శనం సమయం ఎంతంటే?

వరుస సెలవులు ముగినిస నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. దీంతో భక్తులు ఎలాంటి సమయం లేకుండానే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 70,515 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 27,230 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నేడు శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు కూడా కేవలం రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం అవుతోంది.