ScienceAndTech

గాలిని పీల్చుకునే హెడ్‌ఫోన్‌లు

గాలిని పీల్చుకునే హెడ్‌ఫోన్‌లు

డైసన్ కంపెనీ ఇండియాలో కొత్తగా హెడ్‌ఫోన్స్ లాంచ్ చేసింది. దీని పేరు ‘డైసన్ జోన్’. దీని ధర రూ.59,900. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ని కలిగి ఉంటాయి. హెడ్‌ఫోన్స్ లోపల మైక్రో కంప్రెసర్‌లు, ఫిల్టర్‌లను అమర్చారు. వీటి ద్వారా యూజర్లకు శుద్ధి చేసిన గాలి లోపలికి వెళ్తుంది. స్మార్ట్‌ఫోన్‌‌లోని MyDyson యాప్‌‌ ద్వారా హెడ్‌ఫోన్స్‌కు కనెక్ట్ కావచ్చు.

వీటిలో 40mm డ్రైవర్లను అమర్చారు. బ్యాక్‌గ్రౌండ్ నుంచి డిస్టబెన్స్‌ను భారీగా తగ్గిస్తుంది. దీనికోసం ఎనిమిది ANC మైక్రోఫోన్‌లు అందించారు. ఇవి సెకనుకు 3,84,000 సార్లు చుట్టుపక్కల సౌండ్‌ను పర్యవేక్షిస్తాయి. IOS, Android డివైజ్‌లకు రెండింటికి అనుకూలంగా ఉంటుంది. మొబైల్ యాప్‌కు కనెక్ట్ చేసినప్పుడు హెడ్‌ఫోన్స్‌లోని ప్రత్యేక సిస్టం ద్వారా పరిసరాల్లోని గాలి నాణ్యత వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

ఎయిర్ ఫిల్టర్ పనితీరు ఎప్పటికప్పుడు యాప్ ద్వారా తెలుస్తోంది. ఫిల్టర్‌లను మార్చాల్సినప్పుడు వినియోగదారులకు నోటిఫికేషన్ వస్తుంది. MyDyson యాప్‌ ద్వారా హెడ్‌ఫోన్స్‌ సౌండ్, ఇతర ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. ఇవి ANC ఫీచర్ ఆన్‌లో ఉన్నట్లయితే దాదాపు 50 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంటుంది. హెడ్‌ఫోన్స్‌లో పలు ఆటోమెటిక్ సెన్సార్‌లను అమర్చారు.