Movies

ఆస్కార్‌ బరిలో పోటీపడడానికి సిద్దమైన అక్షయ్ కుమార్ సినిమా

ఆస్కార్‌ బరిలో పోటీపడడానికి సిద్దమైన అక్షయ్ కుమార్ సినిమా

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన తాజా చిత్రం ‘మిషన్‌ రాణిగంజ్‌’ (Mission Raniganj). ‘ది గ్రేట్‌ భారత్‌ రెస్క్యూ’ అనేది ఉపశీర్షిక. టిను సురేష్‌ దేశాయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఆస్కార్‌ బరిలో నిలవనుంది.

ఆస్కార్‌ రేసులో పోటీ పడేందుకు జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా ఈ చిత్ర బృందం నామినేషన్ వేసింది. దీంతో ఈ చిత్రానికి సోషల్‌ మీడియాలో ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. ఇక గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కూడా ఇలానే ఇండిపెండెంట్‌గా కొన్ని కేటగిరీల్లో నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఆస్కార్‌ 2024’ (Oscar 2024) అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడగా, జ్యూరీ మలయాళ మూవీ ‘2018’ను ఎంపిక చేసింది.‘మిషన్‌ రాణిగంజ్‌’ విషయానికొస్తే.. రాణిగంజ్‌ కోల్‌ఫీల్డ్స్‌లో 65మంది మైనర్లను కాపాడిన జశ్వంత్‌ సింగ్‌ గిల్‌ జీవితం ఆధారంగా ఇది తెరకెక్కింది. అక్షయ్‌ కుమార్‌ టైటిల్‌ పాత్రలో కనిపించగా ఆయన సరసన పరిణీతి చోప్రా నటించారు. అక్టోబర్‌ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ ప్రముఖులు ప్రశంసల అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదిలా ఉండగా వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War) స్క్రిప్ట్‌ ఆస్కార్‌ లైబ్రరీలో శాశ్వతంగా చోటు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్‌లో పంచుకుని సంతోషం వ్యక్తం చేసింది.