బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు సబ్బండవర్ణాల ప్రజల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. కేసీఆర్ విడుదలచేసిన ప్రజా మ్యానిఫెస్టో ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా ఉందని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు సైతం హర్షిస్తున్నారని, 2018 ఎన్నికల్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటినీ వందశాతం పూర్తిచేసిన ఘనత కేసీఆర్ సర్కార్ ది మాత్రమే అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో నేడు దేశానికే ఆదర్శమని, ఇది కేవలం రాబోయే ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్తరాలకు ఉపయోగపడేలా ఉందని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా నిలిచిందని కొనియాడారు.
👉 – Please join our whatsapp channel here