NRI-NRT

అమెరికా ఆలయాల్లో చంద్రబాబు ఆరోగ్యం కోసం పూజలు

అమెరికా ఆలయాల్లో చంద్రబాబు ఆరోగ్యం కోసం పూజలు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతో పాటు వర్జీనియా, మేరీల్యాండ్ రాష్ట్రాలలోని పలు దేవాలయాలలో ఆదివారం నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని పలు పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను భాను ప్రకాష్ మాగులూరి, సుధీర్ కొమ్మి, రాజా రావులపల్లిలు సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో రమేష్ గుత్తా, సురేఖ చనుమోలు, భవాని పర్వతనేని, చక్రవర్తి పయ్యావుల, జానకిరామ్ భోగినేని, బాబు వేమన, వీరనారాయణ, రమేష్ అమిర్నేని, వేణు దారపనేని, సతీష్సు, రేష్, నెహ్రు, అమ్మిరాజు, దుర్గాప్రసాద్ కూచిపూడి తదితరులు పాల్గొన్నారు.