Business

నేడు విశాఖలో ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవం

నేడు విశాఖలో ఇన్ఫోసిస్‌  ప్రారంభోత్సవం

విశాఖలో నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రూ.1,624 కోట్లు వాస్తవ రూపంలోకి పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఈ సందర్బంగా నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా నాలుగు యూనిట్ల ప్రారంభోత్సవాలు జరుగుతాయి. మరో రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన కూడా జరుగనుంది.ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 4,160 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.అటు విశాఖలో 1,000 సీటింగ్ సామర్థ్యంతో ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అనకాపల్లి ఫార్మా సెజ్ లో మూడు ఫార్మా కంపెనీలు, రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మధురవాడలోని ఐటీ హిల్‌ నెంబర్‌ 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం.. హెలీప్యాడ్‌ వద్ద జీవీఎంసీ బీచ్‌ క్లీనింగ్‌ మిషన్లు ప్రారంభించనున్నారు జగన్.. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సందర్భ0గా సభను ఉద్దేశించి ప్రసంగీస్తారు సీఎం జగన్. అనంతరం అచ్యుతాపురం ఏపీసెజ్‌కు లో లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z