Politics

భువనేశ్వరీ మరో ట్వీట్

భువనేశ్వరీ మరో ట్వీట్

చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో..భువనేశ్వరీ మరో సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? అంటూ ప్రశ్నించారు భువనేశ్వరీ. నాకు మనోధైర్యం కలిగించేలా టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది..? అని భువనేశ్వరీ ట్వీట్ చేశారు.

బాధలో ఉన్న అమ్మను కలుస్తామంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులివ్వడమేంటీ..? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? అంటూ నిలదీశారు భువనేశ్వరీ. కాగా, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసిబి కోర్టు ఇవాళ విచారించనుంది. ఆన్లైన్ ద్వారా చంద్రబాబును విచారణకు హాజరుపరచాలని రాజమండ్రి జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.కాగా చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ను తమకు ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని ఆయన తరపు లాయర్లు కోర్టులో పిటిషన్లు వేయగా…. న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఇది ఇలా ఉండగా, మరోవైపు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదుచేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్​ను దాఖలు చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z