ఏపీలోని క్యాన్సర్ రోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 21 నుంచి 12 జిల్లా ఆస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సేవలు ప్రారంభించనుంది. కీమోతెరపి, పాలియేటివ్ కేర్ తోపాటు అన్నిరకాల మందులు అందుబాటులో ఉంటాయి. ఒక్కో ఆసుపత్రిలో క్యాన్సర్ యూనిట్ కు ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ను నియమించింది.కాగా, కౌలు రైతులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లోన్ చార్జ్ మాడ్యూల్ లో ఇప్పటివరకు భూయజమానుల వివరాలే ఉండగా….తాజాగా వెబ్ ల్యాండ్ పోర్టల్ తో CCRC పోర్టల్ ను లింక్ చేశారు. దీంతో ఇకపై భూ యజమానులతో పాటు కౌలుదారుల వివరాలు సైతం బ్యాంకర్లు తెలుసుకొని, పంట రుణాలు వారికి సులభంగా మంజూరు చేసే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్ లో కౌలు రైతులకు రూ. 4 వేల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –