DailyDose

సోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌- నేర వార్తలు

సోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌- నేర వార్తలు

సోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణంతో మనీష్‌ సిసోడియాకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏడాదిన్నర క్రితం సీబీఐ, ఈడీ అధికారులు సిసోడియాను అరెస్ట్‌ చేశారు.లిక్కర్‌ స్కామ్‌ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రెండూ విచారిస్తున్నాయి. ఈ క్రమంలో మనీష్‌ సిసోడియాను రెండు దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులూ ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో బయటపడ్డ భారీ స్కామ్‌

 ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ కుంభకోణం బయటపడింది.. ట్రాఫిక్ ఈ-చలాన్లలో నిధుల గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి… వాహనదారుల నుండి పోలీసులు వసూలు చేసే నిధులను సొంత ఖాతాలకు డేటా ఇవాల్వ్ సొల్యూషన్స్ కంపెనీ మళ్లించుకున్నట్టు అభియోగాలు నమోదు చేశారు. సుమారు 35.5 కోట్ల రూపాయలు నిధులు దారి మల్లాయని కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ చల్లాన్ ద్వారా రూ.101 కోట్లకు పైగా వసూలు చేసిన డేటా ఇవాల్వ్ సంస్థ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో కొంత భాగాన్ని సొంత ఖాతాలకు తరలించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.. అయితే, దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఇక, ట్రాఫిక్‌ ఈ-చనాన్ల ద్వారా వచ్చిన సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించిన కేసులో ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొమ్మిరెడ్డి అవినాష్.. మరోవైపు గుంటూరు కోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.. బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది గుంటూరు మొదటి అదనపు జిల్లా కోర్టు.. ఈ చనాన్ల సొమ్ము పక్కదారి పట్టించిన కేసులో.. ఇవాల్వ్ సొల్యూషన్స్ కు చెందిన రాజశేఖర్ అనే ఉద్యోగిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు.. కాగా, ఏపీ సంచలనంగా మారిన ఈ కేసులో లోతైన విచారణ జరిగితే.. అది ఎటువైపు దారి తీస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

 దెయ్యం వదిలిస్తానని చెప్పి యువతిపై అత్యాచారం

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. ఉన్న చోటా నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం మనుషుల చేతిలో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ కొంత మంది మూఢనమ్మకాల పేరిట మోససోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఓ 52 ఏళ్ల మంత్రగాడు దెయ్యం పట్టింది వదిలిస్తాని చెప్పి 18 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనికి సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రెండు బస్సుల మధ్యలో ఇరుక్కుపోయిన బైక్‌

కేరళ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్యలో ద్విచక్ర వాహనం నలిగి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కోజికోడ్‌ (Kozhikode) జిల్లాలో సోమవారం చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.జిల్లాలోని చేవాయూర్‌ (Chevayur) వద్ద ఓ ద్విచక్ర వాహనం రెండు ప్రైవేట్‌ రవాణా బస్సుల మధ్య ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరో బైక్‌ కూడా బస్సుల మధ్య ఇరుక్కుపోయినట్లు చెప్పారు. అయితే బైక్‌ రైడర్‌ గాయాలతో బయటపడినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్ లో ఆర్టీసీ మహిళ ఆత్మహత్య

హైదరాబాద్ లో ఆర్టీసీ మహిళ కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బండ్లగూలో కండక్టర్ శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. అయితే.. కండక్టర్ శ్రీవిద్య ఆత్మహత్య సంఘటనపై కండక్టర్ శ్రీవిద్య తల్లి సంచలన విషయాలు బయటపెట్టారు. నా కూతురు పదేళ్ళుగా కండక్టర్ గా పని చేస్తుందని..నా ఇద్దరు కూతుళ్ళు ఆర్‌టిసిలోనే చేస్తున్నారన్నారు కండక్టర్ శ్రీవిద్య తల్లి.ఇప్పుడు ఉన్న బండ్లగూడ డిపో డీఎం వేధింపులకు గురిచేస్తుందని..కలెక్షన్ రావడం లేదంటూ నా కూతురును వేధించిందని ఆగ్రహించారు. పనిష్మెంట్ డ్యూటీ అంటూ హయత్‌నగర్ టూ‌ డిపోకు ట్రాన్స్ఫర్ చేశారు…శ్రీవిద్య కూతురు పెళ్ళి ఈ నెలలోనే ఉందని వెల్లడించింది కండక్టర్ శ్రీవిద్య తల్లి. పెళ్ళి ఉన్న సమయంలో ఇలా పనిష్మెంట్ డ్యూటీ అని తెలిస్తే పరువు పోతుందని అనుకుందని..అవమానభారం తట్టుకోలేకే నా కూతురు ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. అధికారులు వేధింపులు తాళలేక కండక్టర్ శ్రీవిద్య సూసైడ్ చేసుకుందని.. అధికారులు వేధింపులను ఖండిస్తూ లేడి కండక్టర్ల ఆందోళనకు దిగినట్లు చెప్పుకొచ్చారు.

పదోతరగతి బాలికపై టీచర్ అత్యాచారం

విద్యాబుద్ధులు నేర్పి.. విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. కన్నూ మిన్నూ కానని కామంతో విద్యార్థినులపై  కన్నేస్తున్నారు. వారి మీద అఘాయిత్యాలకు పాల్పడుతూ గర్భిణులుగా మారుస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే  ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వెలుగు చూసింది. ఈ నియోజకవర్గానికి చెందిన ఓ పదహారేళ్ల బాలిక  ఏడాది కిందట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుండేది.ఓ రోజు దాహం వేసి  నీళ్లు తాగడానికి స్టాఫ్ గదిలోకి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడే ఉన్నరెడ్డి నాగయ్య అనే టీచర్ ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను తీవ్రంగా బెదిరించాడు. దీంతో బాలిక భయంతో మిన్నకుండిపోయింది. బాలిక మౌనంగా ఉండిపోవడాన్ని అదునుగా తీసుకున్న సదరు కీచక టీచర్.. ఆ బాలిక మీద  బెదిరింపులకు పాల్పడుతూ అనేకమార్లు అత్యాచారం చేశాడు.

భార్య సీరియల్స్‌ పిచ్చితో విసిగిన భర్త

బుల్లితెర సీరియల్స్‌ చూడని గృహిణి ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సీరియల్స్‌ చూస్తూ కాలం గడిపేస్తుంటారు. ఈ సీరియల్స్‌ పిచ్చిలో పడి భర్త, పిల్లలను కూడా అశ్రద్ధ చేసే మహిళలు సైతం ఉన్నారు. టీవీలకు అతుక్కుపోయి సీరియల్స్‌ చూసే మహిళల వల్ల భార్యభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు కోకొల్లలు. ఛానెల్‌ మార్చమంటే భార్యలకు పట్టరాని కోపం వస్తుంది. తాజాగా ఓ భర్త తన భార్య సీరియల్‌ పిచ్చితో వేగిపోయాడు. దీంతో జీవితం మీద విరక్తి కలిగిందేమో వెనకా ముందు ఆలోచించకుండా ప్రాణాలు తీసేసుకున్నాడు. కామెడీగా అనిపించినా ఈ దుర్ఘటన వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో ఈ సంఘటన వెలుగు చూసింది. 

సైబర్‌ కేటుగాళ్ల గరానా మోసం

ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఎరవేసి అమాయకుల నుంచి లక్షల రూపాయలు దొంగిలిస్తున్న కేసులు ఈ మధ్యకాలంలో లెక్కకుమించి బయటపడుతున్నాయి. కేటుగాళ్ల మాయమాటలకు ఎందరో బలవుతున్నారు. రోజుకో ఎత్తుతో బాధితులను నిండా ముంచుతున్నారు. ఇంటి వద్దనే ఉంటూ ఎలాంటి కష్టం లేకుండా ఆన్‌లైన్‌ చిన్న చిన్న టాస్క్‌లు చేస్తే సులువుగా లక్షల్లో డబ్బు సంపాదించవచ్చని ఆశచూపి వలలో వేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి ఇటువంటి ఇచ్చులోనే చిక్కుకుని రూ.13 లక్షలకుపైగా డబ్బు పోగొట్టుకుని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది. 

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z