Movies

గేమ్ ఛేంజర్‌పై మరో అప్‌డేట్

గేమ్ ఛేంజర్‌పై మరో అప్‌డేట్

రామ్ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతోన్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ సినిమా నుంచి అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి ఈ దసరాకు మొదటి పాటను విడుదల చేయనున్నారని సినిమా వర్గాల సమాచారం. పూర్తి మాస్‌ ట్యూన్‌తో ఇది రానున్నట్లు సమాచారం. ఈ ఫస్ట్‌ సింగిల్ అభిమానుల్లో జోష్ నింపడం ఖాయమని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే మేకర్స్‌ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ ఫస్ట్‌ సాంగ్ రికార్డింగ్‌ పనులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఇందులో ఓ పాట లీక్‌ కాగా నిర్మాత దిల్‌రాజు సీరియస్‌ అయ్యారు. లీక్ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z