ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఐదో విడత వారాహి యాత్ర, తెదేపా-జనసేన సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశం నిర్వహణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చర్చించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు.రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగునీరందక కృష్ణా, పశ్చిమ డెల్టాలో 4లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జనసైనికులు, వీర మహిళలపై అక్రమంగా పెడుతున్న కేసుల అంశం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.
👉 – Please join our whatsapp channel here –