గాంధీ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా, వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీటుగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జైషా అసలు ఏం చేస్తున్నారని, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కుమారుడి సంగతేంటని కాషాయ నేతలను నిలదీశారు.అమిత్ షా కొడుకు ప్రచారం చేస్తున్నాడని తాను విన్నానని, బీజేపీ నేతల బాగోతం చూడండి..వారి పిల్లలు ఏం చేస్తున్నారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండని రాహుల్ వ్యాఖ్యానించారు. కాషాయ నేతల పిల్లలందరూ వారసులుగానే ఎంట్రీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.ఇక గాంధీ కుటుంబ వారసులే దేశ ప్రధానులుగా వ్యవహరించారని, కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని బీజేపీ తరచూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వారసత్వ రాజకీయాలే భారత్‌కు అతిపెద్ద సమస్యని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడుతుంటారు.
👉 – Please join our whatsapp channel here –