DailyDose

ఎన్నికల ప్రచారానికి రానున్నా బీజేపీ అగ్రనేతలు- తాజా వార్తలు

ఎన్నికల ప్రచారానికి రానున్నా బీజేపీ అగ్రనేతలు- తాజా వార్తలు

* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. సర్వ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72,123 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 26,054 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.01 కోట్లు.శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగ నరసింహుడు రూపంలో ఊరేగిన స్వామి రాత్రి ముగ్ధమనోహర స్వరూపుడై ఉభయ దేవేరులు శ్రీదేవి, భూదేవితో కలిసి భక్తులను సాక్షాత్కరించారు.

* ఎన్నికల ప్రచారానికి రానున్నా బీజేపీ అగ్రనేతలు

తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి. జాతీయ నేతల రాకతో పొలిటికల్ జోష్ పెరిగింది. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ప్రచారం చేయనున్నారు. ఈనెల 27న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈనెల 31న యూపీ సీఎం యోగి, 28న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, ఈనెల 20న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలంగాణలో పర్యటించి… ప్రచారం చేయనున్నారు.

* బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కేసు నమోదు

ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించినందుకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు((Boath MLA Rathod Bapu rao)పై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే 2012లో ఆదిలాబాద్ సమీపంలోని బట్టి సమర్గం సర్వే నెంబర్ 53/2లో రెండు గంటల భూమిని ఆదిత్య ఖండేకర్ అనే వ్యక్తికి విక్రయించారు. తిరిగి ఆ ప్లాట్లను 2019లో సంతోష్ అనే వ్యక్తి కొన్నారు. మొదట కొనుగోలు చేసిన ఆదిత్య ఖండేకర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతోపాటు సుదర్శన్ అనే వ్యక్తిపై 420 421 409,426 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ అశోక్ తెలిపారు.

* మేడ్చల్ లో బీఆర్ఎస్ కు మరో షాక్

తెలంగాణలో ఎన్నికలవేళ అనేకం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ఆగడం లేదు. ఈ క్రమంలోనే మరో నేత బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. బుధవారం నాడు సుధీర్ రెడ్డి నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం.

* రేపు బిజెపి అభ్యర్థుల ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి రేపు తమ అభ్యర్థుల తాలూకా లిస్ట్ ను ప్రకటించబోతుంది. ఈరోజు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో మొదటి జాబితాను ఖరారు చేయనుంది. ఇందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌లు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.రాష్ట్రంలో ఉన్న పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జావడేకర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌లు కూడా బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం వద్ద దాదాపు 40-50 మంది అభ్యర్థుల పేర్లతో మొదటి జాబితా సిద్ధంగా ఉందని బీజేపీ ముఖ్యనేతలు వెల్లడించారు. ఈ జాబితాకు సీఈసీ ఆమోదం తెలపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

* కేసీఆర్ తో పోటీపై విజయశాంతి రియాక్ట్

తెలంగాణ బీజేపీలో విజయశాంతి ట్వీట్ కల్లోలం సృష్టిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని.. వ్యూహాత్మక నిర్ణయాలు ఎప్పుడైనా పార్టీ నిర్ధేశితమేనని ట్వీట్ చేశారు. గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తాను.. కేసీఆర్‌పై పోటీ చేయాలని కార్యకర్తలు అడగటంలో తప్పులేదన్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో.. విజయశాంతి పోస్ట్‌పై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలయ్యింది.

* కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ కానున్నా రాగిడి లక్ష్మారెడ్డి

BRS లో చేరనున్నారు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,సీనియర్ లీడర్ రాగిడి లక్ష్మారెడ్డి. మరి కాసేపట్లో కాంగ్రెస్ ను వీడనున్నారు రాగిడి లాక్ష్మ రెడ్డి. ఈ మేరకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,సీనియర్ లీడర్ లక్ష్మా రెడ్డి. మేడ్చల్ ప్రజా ఆశీర్వాదా సభలో అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ కానున్నారు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,సీనియర్ లీడర్ లక్ష్మ రెడ్డి.గా, కాంగ్రెస్ పార్టీ టికెట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ స్పష్టమైన ఆధారాలతో మేము పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళాం, వివిధ రూపాల్లో నిరసన తెలియజేశాము. ఇందుకుగాను మమ్మల్ని పార్టీ నుంచి ఎలాంటి సంజాయిషీ లేకుండా సస్పెండ్ చేశారు.

* ఢిల్లీలో ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ పరిశ్రమలోని ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. ఇంతలోనే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీ అంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి.ఫ్యాక్టరీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. 26 ఫైరింజన్‌ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

* గుండె పోటుతో ప్రముఖ నటుడు మృతి

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు కుందర జానీ (71) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కేరళలోని కొల్లామ్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కుందర జానీ మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z