Devotional

అరుణాచలేశ్వరుని మహత్స్యం

The divine glory of arunachaleswara sivalingam

1. అరుణాచల శివలింగ మహత్యం – ఆద్యాత్మిక వార్తలు
జానకి” అష్టమూర్తి తత్త్వము” అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,సాకారోపాసన(రూపమ) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.కంచిలో పృథివీ లింగం,జంబుకేశ్వరంలో జలలింగం,అరుణాచలంలో అగ్నిలింగం,చిదంబరంలో ఆకాశలింగం,శ్రీకాళహస్తిలో వాయులింగం,కోణార్కలో సూర్యలింగం,సీతగుండంలో చంద్రలింగం,ఖాట్మండులో యాజమాన లింగం –ఈ ఎనిమిది అష్టమూర్తులు.ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.అక్కడశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.దర్శనాత్ అభ్రశదసిజననాత్ కమలాలేస్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!స్మరణము మనసుకు సంబంధించినది.మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.దాని పేరే అరుణాచలం.అచలము అంటే కొండ.దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.ఆకొండ అంతా శివుడే.అక్కడ కొండశివుడు.కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది.అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు.ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి.అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.అందుకని డ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది.రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు.ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది.అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది.ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు.అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు.దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది.అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది.అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది.ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు.లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు.శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే.అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ.అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ…..ఓం నమఃశివాయ .
2. తిరుమల జేఈవోగా ధర్మారెడ్డి!
తిరుమల, తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి (జేఈవో)గా ఎ.వి.ధర్మారెడ్డి నియామక ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. కేంద్ర హోంశాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ధర్మారెడ్డిని డిప్యుటేషన్పై రాష్ట్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల ప్రతిపాదనలు పంపింది. ముఖ్యమంత్రిజగన్మోహన్రెడ్డి లేఖ రాయడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను సమ్మతిస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన అనుమతికి కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఇదివరకు ఏపీలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని మొత్తం ఏడేళ్లపాటు ఏపీలో కొనసాగడానికి అనుమతి ఇచ్చింది. 2022 మే 14వరకూ కానీ, తదుపరి ఉత్తర్వులు జారీచేసేంతవరకూ కానీ ఆయన రాష్ట్రంలో పనిచేయవచ్చు. మంగళవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తిరుమల జేఈవోగా ధర్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. శుక్రవారం తిరుమలలో బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. ధర్మారెడ్డి గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 2004 జులై 5 నుంచి 2006 సెప్టెంబరు 9 వరకు తిరుమల జేఈవో హోదాలో ప్రత్యేకాధికారిగా పనిచేశారు. రెండో విడతగా 2008 ఏప్రిల్ 2 నుంచి 2010 ఆగస్టు 31 వరకూ విధులు నిర్వర్తించారు.
3. 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
శ్రీవారి దివ్యదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని ఈ నెల 16న రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. కోయిల్ఆళ్వారు తిరుమంజనం, చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమంజనం కారణంగా 16న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వదర్శనం నిలిపివేయనున్నారు. ఆ తర్వాత దర్శనం ప్రారంభించి.. చంద్రగ్రహణం కారణంగా మళ్లీ సాయంత్రం 5 గంటల తర్వాత ఆపేస్తారు. అంటే మొత్తంగా దర్శన సమయం కేవలం 5 గంటల పాటు మాత్రమే మిగులుతుంది. చంద్రగ్రహణం వల్ల రాత్రి 7 గంటల తర్వాత ఆలయ తలుపులు మూసివేసి 17న ఉదయం 5 గంటలకు తెరుస్తారు. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి.. ఆణివార ఆస్థానం పూర్తయ్యాక ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభించనున్నట్లు తితిదే వివరించింది.
4. ప్రశాంత దర్శన భాగ్యం
తిరుమలలో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులు ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకునేలా మొత్తం వ్యవస్థను ఐదేళ్లలో దశలవారీగా ప్రక్షాళన చేయనున్నట్లు తితిదే పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకోసం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని వెల్లడించారు. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శన విధానాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయ విధానాలను తీసుకొస్తామని, కాలుష్యాన్ని నివారించేందుకు కొండపైకి వెళ్లే వాహనాలన్నింటినీ విద్యుత్తు వాహనాలుగా మారుస్తామని చెప్పారు. అలిపిరి సమీపంలో శాటిలైట్ పట్టణాలను నిర్మిస్తామని, ఇక్కడి నుంచే నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లేలా ఏర్పాటు చేస్తామని, ఆ చుట్టుపక్కల మద్య నిషేధం అమలు చేస్తామని పేర్కొన్నారు. తితిదే ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారెడ్డి సోమవారం సాయంత్రం ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
5. రాజన్న లడ్డూలో నట్టు!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ప్రసాదం లడ్డూలో ఇనుప నట్టు కనిపించింది. సోమవారం మంచిర్యాల జిల్లా నుంచి వచ్చిన భక్తుడు డి.శివరాం కౌంటర్లో ప్రసాదాలు కొన్నారు. ఒక లడ్డూలో నట్టు కనిపించిందని ఆరోపించారు. ప్రసాదాల తయారీ పర్యవేక్షకుడు నర్సయ్యను వివరణ కోరగా ఇంత పెద్ద నట్టు ఉంటే లడ్డూ తయారుచేయడమే కుదరదన్నారు.ఇతర ప్రసాదాల తయారీలోనూ పూర్తి స్థాయిలో నాణ్యత పాటిస్తున్నామని చెబుతున్నారు.
6. తిరుమల జేఈవోగా ధర్మారెడ్డి!
తిరుమల, తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి (జేఈవో)గా ఎ.వి.ధర్మారెడ్డి నియామక ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. కేంద్ర హోంశాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ధర్మారెడ్డిని డిప్యుటేషన్పై రాష్ట్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల ప్రతిపాదనలు పంపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లేఖ రాయడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను సమ్మతిస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన అనుమతికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఇదివరకు ఏపీలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని మొత్తం ఏడేళ్లపాటు ఏపీలో కొనసాగడానికి అనుమతి ఇచ్చింది. 2022 మే 14వరకు కానీ, తదుపరి ఉత్తర్వులు జారీచేసేంతవరకు కానీ ఆయన రాష్ట్రంలో పనిచేయవచ్చు. మంగళవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తిరుమల జేఈవోగా ధర్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. శుక్రవారం తిరుమలలో బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. ధర్మారెడ్డి గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 2004 జులై 5 నుంచి 2006 సెప్టెంబరు 9 వరకు తిరుమల జేఈవో హోదాలో ప్రత్యేకాధికారిగా పనిచేశారు. రెండో విడతగా 2008 ఏప్రిల్ 2 నుంచి 2010 ఆగస్టు 31 వరకు విధులు నిర్వర్తించారు.
7. 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం జారీ చేసే దివ్యదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని ఈ నెల 16న రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. కోయిల్ఆళ్వారు తిరుమంజనం, చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమంజనం కారణంగా 16న ఉదయం 6నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సర్వదర్శనం నిలిపివేయనున్నారు. ఆ తర్వాత దర్శనం ప్రారంభించి.. చంద్రగ్రహణం కారణంగా మళ్లీ సాయంత్రం 5గంటల తర్వాత ఆపేస్తారు. అంటే మొత్తంగా దర్శన సమయం 5గంటల పాటే మిగులుతుంది. చంద్రగ్రహణం వల్ల రాత్రి 7గంటల తర్వాత ఆలయ తలుపులు మూసివేసి 17న ఉదయం 5 గంటలకు తెరుస్తారు. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి.. ఆణివార ఆస్థానం పూర్తయ్యాక ఉదయం 11గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభిస్తారు.
8. 15వ దలైలామాగా సత్యసాయి విద్యార్థి
బౌద్ధ మతగురువు పదిహేనవ దలైలామాగా సత్యసాయి విద్యార్థి దావావంగ్డి ఎంపికయ్యాడు. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్కు చెందిన ప్రేమవంగ్డి, పంజూరాయ్ దంపతుల కుమారుడైన దావావంగ్డి పుట్టపర్తిలోని సత్యసాయి ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుత 14వ దలైలామా తన తదుపరి దలైలామాగా దావావంగ్డిని వివిధ కోణాల్లో క్షుణ్నంగా పరిశీలించి ఎంపిక చేశారు. ఈ బాలుణ్ని దలైలామాగా పంపేందుకు బౌద్ధగురువులు తల్లిదండ్రులతో చర్చించి ఒప్పించారు. ఇటీవల సత్యసాయి ప్రాథమిక పాఠశాలకు బౌద్ధ ప్రతినిధుల బృందం వచ్చి, అధికార ఉత్తర్వుల ప్రతిని అందజేసి..ఆ బాలుణ్ని తమతో తీసుకెళ్లారు. ఎంపికైన బాలుడు మైసూరు సమీపంలోని బైలుకుప్పే (గోల్డెన్ టెంపుల్) బౌద్ధారామంలో 15 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్న అనంతరం దలైలామాగా బాధ్యతలు స్వీకరిస్తారు. తనను సాయిరాం అని పిలిస్తే పలుకుతానని దావావంగ్డి తన స్నేహితులతో చెప్పి వీడ్కోలు తీసుకోవడం విశేషం.
9. పెద్దమ్మతల్లి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
జూబ్లీహిల్స్లో వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతియేటా అషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆల యాన్ని అనేక రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు,పూలతో శోభా యమానంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున పెద్దమ్మతల్లికి అభి షేకం నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ ట్రస్టీ పి. విష్ణు వర్దన్రెడ్డి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, పంచగవ్వ ప్రాశ న, ఋత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పెద్దమ్మ తల్లికి పల్లకీ సేవ నిర్వహించారు. శాకాం బరీ అవతారంలో కొలువుతీరిన పెద్దమ్మతల్లిని దర్శించేందుకు నగరం నలు మూలల నుంచి భారీఎత్తున భక్తులు తరలివచ్చారు. శాకాంబరీ ఉత్సవాల్లో రెండోరోజైన ఈ రోజు ఉదయం 10 గంటలనుంచి సామూహిక శ్రీ లలితా సహస్రనామ కుంకు మార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు.
10. అమ్మవారిని దర్శించుకున్న మోహన్‌ భగవత్‌
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్వహించనున్న అఖిల భారత ప్రచారక్‌ల సమావేశంలో పాల్గొనేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ విజయవాడ వచ్చారు. ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో మోహన్‌ భగవత్‌, ఇతర ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులను సాదరంగా ఆహ్వానించారు. సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదం అనంతరం ఆలయ కార్యనిర్వాహక అధికారి వి.కోటేశ్వరమ్మ వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. జగన్మాత దర్శనం చాలా సంతోషంగా ఉందని భగవత్‌ ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
11. తిరుమల \|/ సమాచారం*
_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈ రోజు మంగళవారం,
*09.07.2019*
ఉదయం 5 గంటల
సమయానికి,
_తిరుమల: *23C° – 33℃°*_
• నిన్న *85,649* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో *12*
గదుల్లో భక్తులు
చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*12* గంటలు పట్టవచ్చును
• నిన్న *30,499* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3.30* కోట్లు,

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
ఐదు గంటల సమయం
పట్టవచ్చును,
*_వయోవృద్దులు రియు దివ్యాంగుల_*
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
*_చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_
*తా:* _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_
_కావున లెమ్ము స్వామి_
12. శుభమస్తు
తేది : 9, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 26 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 32 ని॥ వరకు)
క్షత్రం : హస్త
(నిన్న రాత్రి 6 గం॥ 38 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 19 ని॥ వరకు)
యోగము : పరిఘము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 4 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 11 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 8 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 16 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 0 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 15 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 41 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 47 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : కన్య
13. చరిత్ర ఈ రోజు/జూలై 9**అర్జెంటీనా జాతీయ దినోత్సవం*
1875 : బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్థాపించబడింది.
1918 : ఒక సుప్రసిద్ధ తత్త్వవేత్త. యూజీ గా సుప్రసిద్ధుడు ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి జననం (మ.2007).
1920 : భారత కమ్యూనిష్టు పార్టీ నేత తమ్మారెడ్డి సత్యనారాయణ జననం.
1925 : భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు గురుదత్ జననం(మ.1964).

1927 : తెలుగు సినిమా రంగంలో గుమ్మడి గా పేరు పొందిన గుమ్మడి వెంకటేశ్వరరావు జననం (మ.2010).
1966 : ప్రముఖ శాస్త్రీయ సంగీత మరియు సినీ గాయకుడు ఉన్నికృష్ణన్ జననం.
1969 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు వెంకటపతి రాజు జననం.
1969: భారత వన్యప్రాణి బోర్డు, పులి ని జాతీయ జంతువు గా ప్రకటించింది.
14. శుభోదయం*హానీయుని మాట*
ఎక్కడ అహంకారం ప్రారంభం అవుతుందో అక్కడ మనిషి పతనమూ ప్రారంభమవుతుంది.”
నేటీ మంచి మా
ప్రతి ఘన విజయము అంతకంటే ఘనమైన భాధ్యతను తన వెంట మోసుకొస్తుంది.”
15. నేటి సామెత *డబ్బుకు లోకం దాసోహం*
డబ్బుకు లోకం దాసోహం అంటే ధనానికి అంతా దాసులవుతారని. దాసః + అహం = దాసోహం – అనగా నేను దాసుడను అని అర్ధం. తెలుగు పదాలనూ, సంస్కృత సమాసాన్నీ కలగలపడం ఈ సామెతలో ఒక ప్రత్యేకత. దాదాపు అందరికీ తెలిసిన జీవిత సత్యాన్ని చాటే నానుడి ఇది. ఇదే అర్ధంలో ఎన్నో పాటలు, పద్యాలు, వాడుక పదాలు ఉన్నాయి.
ధనమేరా అన్నిటకీ మూలం – అనే తెలుగు సినిమా పాటపైసా మే పరమాత్మా – అన్న నానుడి
అర్ధము పురుషార్ధములలోనుత్తమము. అర్ధవంతునకసాధ్యము లోకమందేదియును కానరాదు – అని చిన్నయసూరి రచించిన మిత్రలాభములో ఉంది.
16. నేటి ఆణిముత్యం
బిడ్డ జనియింప శుభమంచు పెద్దపెట్టు
దీర్ఘకాల మానందాన తేలిపోయి
సుగతి పొందంగ దుఃఖాన సోలిపోవు
టెంత చిత్రము విధిలీల లెంచ వశమె!
*భావము :*
బిడ్డపుట్టినప్పుడు శుభమని పొంగిపోయేవారు వయసు మారిన పిమ్మట మరణం చెందితే దుఃఖాన మునగటం విధి లీల.
17. నేటి జాతీయంకంచు కోట*
ఎవరికైన ఒక ప్రాంతంలో వారిమాటకు ఎదురులేకుంటే, వారి మాట చెల్లుబాటు అవుతుంటే ఆ ప్రాంతాన్ని వారి కంచు కోటగా అంటుంటారు.
ఉదా: ఈ నియోజిక వర్గము …..పార్టీ వారికి కంచు కోట
18. నేటి కథ
*ఏ వృత్తీ చెడ్డది కాదు*
అక్బర్‌కు అనేకమంది మంత్రులు ఉన్నారు. వారిలో ముల్లా దో పైజా అనే మంత్రి ఒకడు. ఒకరోజు అందరి ముందు బీర్బల్‌ను అవమానించాలని నిర్ణయించు కున్నాడు. ఆ రోజు వారిమధ్య సంభాషణ ఇలా జరిగింది.’బీర్బల్‌ మీరు మంత్రిగాకముందు ఏం చేసేవారు? వ్యవసాయం, మా తండ్రి కూడా రైతే ! అయితే ఆయనెలా మరణించాడు? చలికాలంలో పొలం వెళ్లి అక్కడే మరణించారు. మరి మీ తాత? ఆయనా పొలంలోనే మరణించారు. నీరుందా లేదా అని చూస్తూ కాలుజారి బావిలో పడ్డారు. అందుకేనయ్యా నే చెబుతా వ్యవసాయం చాలా చెడ్డది.అయితే ముల్లాజీ మీ కుటుంబ సాంప్రదాయ వృత్తేమిటి? మాది తరతరాలుగా సైనికుల కుటుంబం. అలాగా! అయితే మీ తండ్రి ఎలా మరణించారు? ఆయనో సైనికుడు. యుద్ధరంగంలోనే వీరమరణం పొందాడు. మరి మీతాత? ఆయనా యుద్ధంలోనే మరణించారు. అందుకే నేను చెబుతున్నా సైనిక జీవితం మీ కుటుంబానికి చెడ్డది. కనుక వేరే వృత్తి చూసుకోవటం మంచిది అన్నాడు బీర్బల్‌.అప్పుడు ఏ వృత్తీ చెడ్డది కాదని ముల్లాకు అర్ధమైంది..
19. సగరుడు
ఆయోధ్య నగరాన్ని సగరుడనే ఒక మహారాజు పరిపాలిస్తూండేవాడు.ఆయన పేరు సగరుడు అంటే విషాన్ని తన శరీరంలో కలిగి ఉన్న వాడని అర్ధం. ఆయన తండ్రి అసితుడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఆయన తన భార్యలతో కలిసి హిమాలయ పర్వతాలలో భృగు ప్రశ్రమణము అనే పర్వతం వద్ద తపస్సు చేయడానికి వెళ్ళిన సమయంలో ఆయన భార్యలిద్దరూ గర్భవతులయ్యారు. రెండవ భార్యకు పిల్లలు కలుగకూడదనే ఆలోచనతో మొదటి భార్య విషాన్ని పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న రెండవ భార్య భృగుమహర్షి వద్దకు వెళ్ళి తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని కాపాడమని వేడుకుంది. భృగుమహర్షి మహ తపశ్శక్తి సంపన్నుడు, త్రికాలవేది కనుక ఆయన జరిగినది మొత్తం తన యోగ దృష్టితో గ్రహించాడు. పుట్టేవాడు గొప్పవాడవుతాడని ఆశీర్వదించి, తన శరీరంలో విషం కలిగి పుడతాడు కనుక సగరుడవుతాడని చెప్పాడు. అటువంటి సగరుడికి ఇద్దరు భార్యలు. మొడటి భార్య పేరు కేశిని. ఆమె ధర్మం తెలిసినది, ధర్మాన్నే ఆచరించేటువంటి లక్షణం కలిగినది, పతివ్రత, మహాసాద్వి. రెండవ భార్య పేరు సుమతి. మంచి సౌందర్య రాశి.ఈమె గరుత్మంతుడి చెల్లెలు. మొదటి భార్యది అంతః సౌందర్యం, రెండవ భార్యది బాహ్య సౌందర్యం. ఇద్దరు భార్యలు ఉన్నప్పటికి సగర చక్రవర్తికి సంతానం కలుగలేదు. కొంతకాలం పాటు సగర చక్రవత్రి, ఆయన భార్యలు సంతోషంతో కాలం గడిపినా, కాలక్రమంలో వారికి సంతానం లేదన్న భాధ మొదలైంది. వంశం నిలబదన్న దుఖం కలిగింది. ఆ కాలంలో ఏదినా సమస్య వస్తే వెంటనే పెద్దలైనవారు, ఋషులు, గురువుల వద్దకు వెళ్ళేవారు. అందువల్ల సగర చక్రవర్తి బృగు ప్రశ్రమణానికి వెళ్ళి నూరు సంవత్సరముల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు ప్రీతి చెందిన భృగుమహర్షి సగర చక్రవర్తి వద్దకు వచ్చి, నీవు గొప్ప కీర్తిమంతుడవు అవుతావు, నీ ఇద్దరు భార్యలలో ఒకరికి వంశకరుడు ( వంశాన్ని నిలబెట్టేవాడు/వంశ వృద్ధిని చేసేవాడు ) అయిన కూమారుడు జన్మిస్తాడు. మరొక భార్యకు మహా ఉత్సాహవంతులైన 60,000 మంది కూమారులు జన్మిస్తారు అని ఆశీర్వదించాడు భృగు మహర్షి.
20. జూలై 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ముందు జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం నిర్వహిస్తున్నారు. దాంతో పాటు బుధవారం చంద్రగ్రహణం కారణంగా జూలై 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కారణంగా జూలై 16న ఉదయం 6 నుండి మధ్యాహ్నం12 గంటల వరకు సర్వదర్శనం ఉండదు. చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 5 గంటల వరకే కంపార్ట్‌మెంట్లలోనికి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 నుంచి మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేస్తారు. ఈ నేపథ్యంలో జూలై 16న మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకు కేవలం 5 గంటలు మాత్రమే భక్తులకు దర్శన సమయం ఉంటుంది. ఈ కారణంగా దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.