Devotional

శ్రీవారి గరుడ సేవకు పోటెత్తిన భక్తులు

శ్రీవారి గరుడ సేవకు పోటెత్తిన భక్తులు

డు కొండలు భక్తజన సంద్రంగా మారాయి. గరుడ సేవను వీక్షించేందుకు లక్షలాది మంది తిరుమలకు పోటెత్తారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య గురువారం సాయంత్రం శ్రీవారి గరుడసేవ ప్రారంభమైంది.తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవీగా ముందు వెళ్తుండగా.. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. భారీగా తరలివచ్చిన భక్తుల గోవిందనామస్మరణతో తిరువీధులు మార్మోగాయి. తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు. గరుడ సేవకు భారీగా భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భద్రతా పరమైన ఏర్పాట్లు చేసింది. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z