ఇది ఆధునిక మహాభారతం. తన భర్తను రూ.5 లక్షలకు మరో మహిళకు విక్రయించిన భార్య కథ. ఒక తెలుగు సినిమాలో కథానాయిక తన భర్తను ప్రేమించిన మహిళకు రూ.కోటికి విక్రయిస్తుంది. సరిగ్గా అదే తరహా ఘటన కర్ణాటకలోని మండ్య సమీప ఓ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఒక మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని ఆ గృహిణి గుర్తించింది. వారిద్దరూ పడకపై ఉన్నప్పుడు నేరుగా నిలదీసింది. ఆడవాళ్ల ఇద్దరి మధ్య జరిగిన గొడవ పంచాయితీకి చేరింది. ‘నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించి.. తీసుకువెళ్లు’ అని ఆ మహిళ తేల్చిచెప్పింది. అలాంటి భర్త నాకేమీ వద్దని, నాకే రూ.5 లక్షల మనోవర్తి ఇచ్చి, అతన్ని నువ్వే ఉంచుకోవాలని ఆ ఇల్లాలు చెప్పింది. ఆ నగదు ఇచ్చేందుకు ఒక నెల సమయం ఇస్తే ఆ నగదు ఇస్తానని ఆ మహిళ చెప్పింది. అందుకు ఆ గృహిణి అంగీకరించింది. వీరిద్దరూ చేసుకున్న రాజీ ఒప్పందం చూసి పంచాయితీ ప్రతినిధులు, గ్రామస్థులు అవాక్కయ్యారు.
👉 – Please join our whatsapp channel here –