Politics

పవన్ పై బొత్స ఫైర్

పవన్ పై బొత్స ఫైర్

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే నాపై కేసులు పెడతామంటున్నాడు…బైజుస్ ఒప్పందంపై దమ్ముంటే పవన్ కళ్యాణ్ సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలని పేర్కొన్నారు. TDP, జనసేన అధికారంలోకి రావడం కల్ల…సమీప భవిష్యత్తులో అటువంటి అవకాశం లేదని ఎద్దేవా చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.అధికారంలోకి వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ కలలు కంటున్నారు..పవన్ కళ్యాణ్ ఏదైనా మా ట్లాడే ముందు అవగాహన తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. ట్యూషన్ కావాలంటే చెబుతానన్నారు. బైజుస్ కంటెంట్ రాష్ట్రంలో చదువున్న విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బైజ్యుస్, ఐబీ కోసం ఒక్క రూపాయి కట్టినట్టు నిరూపించగలిగితే అప్పుడు మాట్లాడాలని ఫైర్‌ అయ్యారు. EAMCET కౌన్సిలింగ్ పై స్పష్టత ఇచ్చిన బొత్స సత్యన్నారాయణ.. మూడోవిడత కౌన్సిలింగ్ కోసం తల్లిదండ్రుల నుంచి వినతులు వస్తున్నాయని వెల్లడించారు. అడ్మిషన్ల పై విధాన పరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z