కాంగ్రెస్ పార్టీ రెండో విడత జాబితా అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు ఢిల్లీలో ఆదివారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు హాజరు కాగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌లు అటెండ్ కాలేదు. నలభై అసెంబ్లీ సెగ్మెంట్‌లలో టఫ్ కాంపిటేషన్ ఉండటంతో.. అభ్యర్ధులను ఫిల్టర్ చేయడంలో స్క్రీనింగ్ కమిటీకి సవాల్‌గా మారింది. రెండు గంటల తర్వాత కూడా అభ్యర్ధుల అంశం ఓ కొలిక్కి రాకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక ఈ నెల 25 లేదా 26న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనున్నది. ఆ తర్వాతే కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కానున్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
👉 – Please join our whatsapp channel here –